సామ్‌ ఆనందం.. చై శీర్షాసనం.. భద్రం నవ్వులు..

తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు అగ్ర కథానాయిక సమంత కృతజ్ఞతలు తెలిపారు. తన ఇన్‌స్టా ఫాలోవర్లు 11 మిలియన్లు చేరిన సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. మరోవైపు నాగచైతన్య యోగా

Updated : 08 Dec 2022 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు అగ్ర కథానాయిక సమంత కృతజ్ఞతలు తెలిపారు. తన ఇన్‌స్టా ఫాలోవర్లు 11 మిలియన్లు చేరిన సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. అంతే కాదండోయ్‌ తన ఇంటి మేడపైన పండించిన కీరదోశను కోస్తూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు నాగచైతన్య యోగా చేస్తూ శీర్షాసనమేసిన ఫొటోను పంచుకున్నారు. ఇక మెగా డాటర్‌ నిహారిక తనకు కాబోయే భర్త చైతన్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పేరెంట్స్‌ డే సందర్భంగా మంచు మనోజ్‌ తన తల్లిదండ్రుల ఫొటోను పంచుకోగా, అమీ జాక్సన్‌ తన అందాలతో నెటిజన్లను అలరించారు. ఇక కమెడియన్‌ భద్రం తనదైన శైలిలో నవ్వులు పంచారు. కనికాకపూర్‌ విసిరిన మేకప్‌ ఛాలెంజ్‌ను ఉపాసన స్వీకరించారు. ఇలా మన సినీ తారలు ఏయే పోస్ట్‌లు చేశారో చూసేద్దామా!













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని