Salaar: ‘సలార్‌’ ఆ సినిమాకు రీమేక్‌..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్‌’. ఈ సినిమాకు (Salaar)సంబంధించిన ఓ రూమర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Published : 02 Oct 2023 14:07 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‌’. ఇటీవలే దీని విడుదల తేదీ డిసెంబర్‌ 22గా ఖరారు చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై ఎన్నో వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ‘సలార్’కు సంబంధించిన ఓ రూమర్ సినీప్రియుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే దాన్ని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖండిస్తున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 2014లో ‘ఉగ్రం’ అనే కన్నడ సినిమా రూపొంది విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు భాషల్లో రీమేక్‌ అయింది. తాజాగా ‘సలార్‌’ దానికి రీమేక్‌ అని అంటున్నారు. కన్నడ ‘ఉగ్రం’ సినిమా సంగీత దర్శకుడు ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన వీడియో ఇప్పుడు ఎక్స్‌లో కనిపిస్తోంది. అందులో ఆయన మాట్లాడుతూ..‘ఉగ్రంలో కన్నడ హీరో మురళీ చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఆ పాత్రలో ఎలా చేస్తారా అని ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌ తన యాక్టింగ్‌తో కచ్చితంగా ఆకట్టుకుంటారనే నమ్మకముంది’అని అన్నారు. దీంతో ఈ చిత్రం (Salaar) ‘ఉగ్రం’కు రీమేక్‌ అనే ప్రచారం జోరందుకుంది.

ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్‌

అయితే, ‘సలార్‌’ ప్రారంభ సమయంలోనూ ఇదే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దానిపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్ స్పందించారు. తాను తీసే అన్ని సినిమాల్లో ‘ఉగ్రం’ షేడ్స్‌ ఉంటాయన్నారు. అది తన స్టైల్‌ అని అన్నారు. కానీ, ‘సలార్‌’ మాత్రం కొత్త స్టోరీ అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ సినిమాకు రీమేక్‌ కాదని వెల్లడించారు. మరోవైపు ‘ఉగ్రం’ను యూట్యూబ్‌ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. రీమేక్‌ కాబట్టే దాన్ని తొలగించారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ప్రభాస్‌ అభిమానులు ఖండిస్తున్నారు. కావాలనే ఇలాంటివి సృష్టిస్తున్నారని అంటున్నారు. ‘ఉగ్రం’ ఇప్పటికీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని