Adipurush: జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌..

‘‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం’’ అంటూ శ్రీరామ నామాన్ని వినిపిస్తూ ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్ర బృందం శనివారం ఓ గీతాన్ని విడుదల చేసింది.

Updated : 23 Apr 2023 12:23 IST

‘‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం’’ అంటూ శ్రీరామ నామాన్ని వినిపిస్తూ ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్ర బృందం శనివారం ఓ గీతాన్ని విడుదల చేసింది. ప్రభాస్‌ (Prabhas) టైటిల్‌ పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కించారు. ఇందులో సీతగా కృతిసనన్‌ కనిపించనుండగా.. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా నటించారు. ఈ సినిమా జూన్‌ 16న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అక్షయ తృతీయను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ‘‘జై శ్రీరామ్‌ జై శ్రీరామ్‌.. రాజారాం’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అజయ్‌ - అతుల్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, సుతారియా సుటారియా, రాజేష్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని