Tamannaah: తమన్నా కోసం నా డేటింగ్‌ రూల్‌ బ్రేక్‌ చేశా: విజయ్‌ వర్మ

తమన్నాతో (Tamannaah) ప్రేమ గురించి విజయ్ వర్మ (Vijay Varma) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమెను చూశాక తన ఆలోచనలో మార్పు వచ్చిందన్నారు.

Updated : 28 Aug 2023 13:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమన్నాతో ప్రేమలో ఉన్నట్లు నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma) ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌ వర్మ తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా (Tamannaah) కోసం తాను పెట్టుకున్న డేటింగ్‌ రూల్‌ బ్రేక్‌ చేసినట్లు తెలిపారు.

‘‘నేను నటుడిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ఎవరినీ ప్రేమించకూడదని నియమం పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఆ సమయంలో ఇండస్ట్రీ అంటే చాలా కోపం ఉండేది. కానీ, తమన్నాను కలిశాక నా ఆలోచన మారింది. అప్పటి వరకూ నేను పెట్టుకున్న డేటింగ్‌ రూల్‌ బ్రేక్‌ చేశాను. కళ, బిజినెస్‌, ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన ఉన్నవాళ్లు, సృజనాత్మకత ఉన్న వాళ్లు మన జీవితంలోకి వస్తే ఎంత విలువ ఉంటుందో.. తమన్నాను చూడగానే అర్థమైంది. దీంతో అప్పటి వరకూ ఉన్న నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమన్నా ఏ విషయాన్నైనా చాలా కోణాల్లో ఆలోచిస్తుంది. తన అనుభవం, పనితీరు, అన్నింటికంటే ముఖ్యంగా తన మంచితనం.. ఇవ్వన్నీ నాకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక్కోసారి నేను కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొని ఏదైనా చెప్పినందుకు తర్వాత బాధపడతాను. తమన్నా వెంటనే నా దృష్టి కోణాన్ని మార్చేస్తుంది’’ అంటూ మిల్కీబ్యూటీపై విజయ్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. 

సమంతకు వీడియో కాల్‌ చేసిన విజయ్ దేవరకొండ.. ఎందుకంటే..?

ఇక ‘లస్ట్ స్టోరీస్‌-2’ (Lust Stories 2) సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ వెబ్‌ స్టోరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడే తమన్నా కూడా విజయ్‌తో రిలేషన్ గురించి బయటపెట్టింది. ‘నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్‌ వర్మ వచ్చాడు’అంటూ విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం వీళ్లిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమన్నా తాజాగా ‘భోళా శంకర్‌’, ‘జైలర్‌’లలో కనిపించగా.. విజయ్ వర్మ ‘లస్ట్‌ స్టోరీస్‌2’లో కనిపించారు. మరో రెండు సినిమాలు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని