Jeevitha: తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించండి.. హరీశ్‌శంకర్‌కు జీవిత విజ్ఞప్తి
‘పంచతంత్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జీవిత, హరీశ్ శంకర్ అతిథులుగా హాజరయ్యారు.
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారని, వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ (Jeevitha).. దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar)కు విజ్ఞప్తి చేశారు. ‘పంచతంత్రం’ (Panchathantram) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆమె మాట్లాడారు. తన తనయ శివాత్మిక, స్వాతి, దివ్య శ్రీపాద, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు హరీశ్, జీవిత అతిథులుగా హాజరయ్యారు.
జీవిత మాట్లాడుతూ.. ‘‘నా చిత్ర బృందం నా కుటుంబంలాంటిది. ఐదు కథల సంకలనంగా రూపొందిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది’’అని అన్నారు. వేడుకకు విచ్చేసినందుకు హరీశ్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిత్రంలో ఐదుగురు తెలుగు అమ్మాయిలు నటించారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని (నవ్వుతూ..) హరీశ్‌ను కోరారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. ‘‘ఓ రచయితగా నేను తెలుగు వారినే ఎంపిక చేసేందుకు ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్ టేక్, రెండో టేక్‌కు సంభాషణ మారుస్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వారు ప్రాక్టీస్ అయ్యేందుకు సమయం కావాలంటారు. అందుకే సెట్‌లో మొత్తం తెలుగు వారు ఉండాలనుకుంటా. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల మనవారికి న్యాయం చేయలేకపోతున్నా. ఆ విషయంలో నన్ను క్షమించాలి’’ అని హరీశ్ అన్నారు. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో తెలుగు అమ్మాయి అయిన డింపుల్ హయాతీకి ఓ పాటలో అవకాశం ఇచ్చానని, ఆమెకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ‘పంచతంత్రం’ పెద్ద కంటెంట్ ఉన్న సినిమా అని, టైటిల్ పెట్టడంలోనే దర్శకుడు హర్ష సగం విజయం సాధించారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Movies News
94 ఏళ్ల వయసులో మళ్లీ కెమెరా ముందుకు
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్