NRK21: ‘డెవిల్‌’గా కల్యాణ్‌ రామ్‌ 

కల్యాణ్‌ రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు నవీన్‌ మేడారం ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 05 Jul 2021 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కల్యాణ్‌ రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు నవీన్‌ మేడారం ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథకి ‘డెవిల్‌’ అనే పేరు ఖరారైంది. ‘ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనే ఉపశీర్షిక. లుక్‌ విషయానికొస్తే.. పోరాట సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ ఇది. ప్రయాణిస్తున్న రైలు నుంచి బయటకి వచ్చి ఎవరి మీదో తుపాకి గురి పెట్టి సీరియస్‌గా కనిపించారు కల్యాణ్‌ రామ్‌. ఇదే రైలుపై మన జాతీయ పతాకాన్ని పట్టుకుని కొందరు దర్శమిస్తారు. పొడవాటి జుత్తు, గెడ్డంతో.. పంచె, బ్లేజర్‌ ధరించి మొత్తంగా బ్రిటీష్‌ కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపించారు కల్యాణ్‌ రామ్‌. 1945 నాటి కాలానికి సంబంధించిన కొన్ని పరిణామాల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ విస్సా కథ అందిస్తున్నారు. హర్ష వర్థన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కథానాయకుడిగా కల్యాణ్‌ రామ్‌కి 21వ చిత్రం. నేడు కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సర్‌ప్రైజ్‌ అందించారు దర్శకనిర్మాతలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని