Kamal haasan: అన్బరివ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌

యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ (అన్బుమణి, అరివుమణి) దర్శకులుగా మారుతున్నారు. ఈ ద్వయం... కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న  ఆయన 237వ చిత్రానికి దర్శకత్వం వహించనుంది.  కమల్‌హాసన్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Updated : 13 Jan 2024 09:56 IST

యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ (అన్బుమణి, అరివుమణి) దర్శకులుగా మారుతున్నారు. ఈ ద్వయం... కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న  ఆయన 237వ చిత్రానికి దర్శకత్వం వహించనుంది.  కమల్‌హాసన్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. దక్షిణాదితోపాటు... బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లుగా పనిచేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు అన్బరివ్‌. ‘‘ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతారంగా నా 237వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్స్‌ అన్బరివ్‌లకు మా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం పలుకుతున్నా’’ అంటూ ఎక్స్‌ ద్వారా సందేశాన్ని పంచుకున్నారు కమల్‌హాసన్‌. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ తమ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్‌ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని