Kushi kapoor: సైఫ్‌ కుమారుడు.. శ్రీదేవి కుమార్తె జోడీగా?

కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయడంలో ముందంజలో ఉంటారు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌. ఇప్పుడాయన మరో యువ జంటతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated : 13 Dec 2023 09:33 IST

కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయడంలో ముందంజలో ఉంటారు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌. ఇప్పుడాయన మరో యువ జంటతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్‌ ప్రధాన పాత్రలలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. శౌనా గౌతమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఇబ్రహీం, ఖుషీ కపూర్‌ కలయికలో ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చర్చలు కూడా జరుపుతున్నారాయన.  స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైంది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు కరణ్‌’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని