Karthi 27: కార్తి 27వ చిత్రం.. ఆ రూమర్స్‌ నిజమయ్యాయి

కార్తి కొత్త సినిమా విషయంలో ఇటీవల జరిగిన ప్రచారం నిజమైంది. ఆ వివరాలివీ..

Published : 26 Jul 2023 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి (Karthi) హీరోగా నటించనున్న 27వ సినిమాకి ‘96’ ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రముఖ నటుడు అరవింద్‌ స్వామి (Arvind Swamy) కీలక పాత్ర పోషించనున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. దానిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ కాంబోలో సినిమా ఉన్నట్టు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ ట్వీట్‌ చేశారు. దాన్ని నిర్మాణ సంస్థ రీట్వీట్ చేయడంతో ఆ విషయం అధికారికమైంది. ‘96’కి సంగీతం అందించిన గోవింద్‌ వసంత్‌ ఈ చిత్రానికీ స్వరాలు సమకూర్చనున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కార్తి సోదరుడు, అగ్ర నటుడు సూర్య దంపతులు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరోయిన్‌, టైటిల్‌ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

హరీశ్‌ శంకర్‌కు సారీ చెప్పిన నెటిజన్‌.. కలిసుండాలంటూ ట్వీట్‌

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తి ప్రస్తుతం ‘జపాన్‌’ (Japan) సినిమాలో నటిస్తున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) కథానాయిక. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు