Bollywood: నిజమే.. రోజుకు రెండు కోట్ల పారితోషికం తీసుకున్నా: ప్రముఖ నటుడు

బాలీవుడ్ హీరో కార్తిక్‌ ఆర్యన్(Kartik Aaryan) వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా తాను తీసుకున్న పారితోషికం గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Updated : 22 Jan 2023 12:33 IST

ముంబయి: ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన నటుడు కార్తిక్‌ ఆర్యన్ (Kartik Aaryan)‌‌. గతేడాది ‘భూల్‌ భులయ్యా-2’(Bhool Bhulaiyaa 2) సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు ఈ యువనటుడు. అయితే, ఇటీవల ఈ యంగ్‌ హీరోకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తన మొదటి సినిమాకు రూ.1.75 లక్షలు పారితోషికం తీసుకున్న కార్తిక్‌.. తాజాగా ఓ సినిమాలో 10 రోజులు నటించినందుకు ఏకంగా రూ.20కోట్లు తీసుకున్నాడనే వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

‘‘నేను కొవిడ్‌ సమయంలో నటించిన సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న మాట నిజమే. కానీ నేను ఆ సినిమాను 10 రోజుల్లోనే పూర్తిచేశాను. దీని వల్ల నిర్మాతలకు ఎంతో లాభం వచ్చింది. కాబట్టి నేను ఆ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక గతేడాది నేను నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘భూల్‌ భులయ్యా-2’(Bhool Bhulaiyaa 2)మంచి విజయం సాధించింది. నేను వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ఎంతో కష్టపడతాను. నా కష్టాన్ని చూస్తున్నారు కాబట్టే సినీ ప్రియులు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం’’ అని చెప్పాడు. ఇక ప్రస్తుతం కార్తిక్‌.. అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని