Game Changer: కొత్త షెడ్యూల్‌కు సిద్ధం

‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 09 Oct 2023 13:40 IST

‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ సోమవారం నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుందని సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. అంజలి, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడిగా, తిరు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని