R.Madhavan: వేదాంత్‌ను స్టార్‌ కిడ్స్‌తో పోల్చడం ఇష్టం లేదు: మాధవన్‌

తమ కుమారుడిని ఇతర స్టార్‌ పిల్లలతో పోల్చడం తనకు ఇష్టం లేదని ఆర్‌.మాధవన్‌ తెలిపారు.

Updated : 16 Mar 2024 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో ఆర్‌.మాధవన్‌ (R.Madhavan) తన కుమారుడిని ఇతర స్టార్స్ పిల్లలతో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 
‘‘వేదాంత్‌ దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఒకరు కాదు. కేవలం సెలబ్రిటీ కుమారుడు కావడంతో అతని గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ, అతనిని ఇతర సెలబ్రిటీ పిల్లలతో పోల్చడం నాకు, నా భార్య సరితకు ఇష్టం లేదు.  అలాంటి వాటిని మేము అంగీకరించాలనుకోవడం లేదు. ఇప్పటివరకూ వేదాంత్‌ తన టాలెంట్‌తోనే విజయం సాధించాడు.  ఒక నటుడి కుమారుడు జాతీయస్థాయిలో పతకాలు అందుకున్నాడు. అది అంత తేలికైన విషయం కాదు.  సోషల్‌ మీడియాలో అతనిపై వచ్చే మీమ్స్‌ గురించి పట్టించుకోవడం లేదు. మీమ్స్‌ కారణంగా ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వాటిని సృష్టించేవారు తెలుసుకోలేకపోతున్నారు’’ అని మాధవన్‌ పేర్కొన్నారు. 

అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించిన ‘షైతాన్‌’(Shaitaan) చిత్రంలో మాధవన్‌ నెగిటివ్‌ పాత్ర పోషించారు. హారర్ థ్రిల్లర్‌గా వికాశ్‌భల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జ్యోతిక కీలక పాత్ర పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని