Mahesh babu: అప్పుడు మహేశ్‌.. ఇప్పుడు పవన్‌.. ఒకరికోసం ఒకరు!

పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు (Mahesh babu) ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Published : 04 Sep 2023 17:41 IST

హైదరాబాద్‌: ఇండస్ట్రీలో పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan), మహేశ్‌ బాబులకు (Mahesh babu) ఉన్న క్రేజ్‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా వీళ్లిద్దరికీ సంబంధించిన రెండు వార్తలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు మాత్రం తెగ సంబరపడుతున్నారు. వీళ్లిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారనే టాక్‌ వినిపిస్తుండగా.. ఒకరి కోసం మరొకరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారని వార్త కూడా జోరుగా ప్రచారమవుతోంది.

తాజాగా గ్లింప్స్‌తో సంచలనం సృష్టించిన పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘ఓజీ’ (OG). సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా గ్లింప్స్‌ వాటిని అమాంతం పెంచేసింది. ఫుల్ ట్రీట్‌లా ఉందంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో మహేశ్‌ బాబు కనిపించనున్నారట. ఇప్పటి వరకూ మహేశ్‌ బాబు ఏ సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించలేదు. దీంతో కొత్తదనం కోసం ‘ఓజీ’లో మహేశ్ కోసం కొన్ని సన్నివేశాలను సుజీత్‌ ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

‘హరిహర వీరమల్లు’ విడుదలపై కీలక ప్రకటన చేసిన నిర్మాత..

ఇక మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ‘జల్సా’ సినిమాకు మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు ఆయన వాయిస్‌ థియేటర్లో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. ఇప్పుడు అదే పనిని మహేశ్‌ కోసం పవన్‌ చేయనున్నారట. మహేశ్‌-త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఇందులో పవన్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలని చూస్తున్నారట తివిక్రమ్. కథపరంగా నేపథ్యానికి చాలా ప్రాధాన్యముందట. దాన్ని వివరించడానికి పవన్‌ వాయిస్‌ అయితేనే సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. దీంట్లో నిజమెంతో తెలియదు కానీ, వార్త మాత్రం ట్విటర్లో షేర్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు