Actor Anicka: అదే నా జీవితంలో చివరి రాత్రి అనుకున్నా.. మాజీ ప్రియుడు వేధింపులు బయటపెట్టిన నటి
ప్రముఖ మలయాళ నటి అనికా విక్రమన్ (Anicka Vikhraman) తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై (Anoop Pillai) వేధించేవాడని ఆరోపించింది. తన చేతిలో గాయపడిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి అనికా విక్రమన్ (Anicka Vikhraman) తన మాజీ ప్రియుడిపై ఆరోపణలు చేసింది. తనను ఎంతగానో వేధించేవాడని తెలిపింది, తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని ఆరోపించింది. ఇప్పటికీ అతడు తనని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు దాడిలో గాయపడిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
‘‘నేను అనూప్ పిళ్లై (Anoop Pillai) అనే వ్యక్తిని ప్రేమించాను. నన్ను ఒకప్పుడు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అలా వేధిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. అతడు నాపై రెండోసారి చేయి చేసుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ అతడు పోలీసులతో మాట్లాడి సమస్య పరిష్కారమైందని చెప్పాడు. నేను షూటింగ్‌లకు వెళ్లకుండా నిర్బంధించాడు. నాకు కాల్స్ రాకుండా చేయాలని నా ఫోన్ పగలగొట్టాడు. నా వాట్సాప్ సందేశాలపై నిఘా పెట్టాడు. నేను తనని వదలి వచ్చేసే ముందు నా ఫోన్ ఇచ్చేయాలని వేడుకున్నా ఇవ్వలేదు. అతడు స్పృహ కోల్పోయేంతగా కొట్టేవాడు. అతడు కొట్టిన దెబ్బలకు నా జీవితంలో అదే చివరి రాత్రి అనుకున్నా. నా ముఖమంతా వాచిపోయేలా కొట్టి..‘ఈ ముఖంతో నువ్వు ఎలా నటిస్తావో చూస్తా’ అని అనేవాడు. నేను ఆ దెబ్బలకు ఏడుస్తుంటే డ్రామా చేస్తున్నానంటూ వెక్కిరించేవాడు. నేను బాధపడుతుంటే అతడు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునే వాడు’’ అని పేర్కొంది. ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు