నవ్వించే.. ‘మంచిరోజులు వచ్చాయి’

ఎటు చూసినా కరోనా.. కరోనా.. కరోనా.. దాదాపు ఏడాదిన్నరగా హాయిగా నవ్వడం మర్చిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇదే తరుణంలో ప్రేక్షకులను నవ్వించేందుకు చిత్రసీమ సిద్ధమవుతోంది. ‘ఏక్‌ మినీ కథ’తో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సంతోశ్‌శోభన్‌, హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా జంటగా

Published : 24 Jul 2021 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎటు చూసినా కరోనా.. కరోనా.. కరోనా. దాదాపు ఏడాదిన్నరగా హాయిగా నవ్వడం మర్చిపోయే పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇదే తరుణంలో ప్రేక్షకులను నవ్వించేందుకు చిత్రసీమ సిద్ధమవుతోంది. ‘ఏక్‌ మినీ కథ’తో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సంతోశ్‌ శోభన్‌, హీరోయిన్‌ మెహ్రీన్‌ ఫిర్జాదా జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రో వీడియోను చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియో ద్వారా సినిమాలోని పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. ఆ పాత్రల పేరు, ఆర్టిస్టులను చూస్తుంటే దర్శకుడు ప్రధానంగా హాస్యంతోనే ప్రేక్షకులకు వినోదం పంచే దిశగా సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ‘మీరు భయానికి భయపడి ఎంతదూరం పారిపోతే.. అది మీకు అంత దగ్గరవుతుంది’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, వైవా హర్ష, సుదర్శన్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్‌ అండ్‌ ఎస్‌కేఎన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

ఇదిలా ఉండగా.. చేసింది ఒక్క సినిమానే అయినా.. హీరో సంతోశ్‌ శోభన్‌ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ చేస్తున్న ఈ యంగ్‌ హీరో ప్రముఖ డైరెక్టర్‌ నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. దానికి ఇప్పటికే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. ‘అన్నీ మంచి శకునములే’ అనే పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో మాళవిక నాయర్‌ కథానాయిక. అంతేకాదు.. సంతోశ్‌ హీరోగా అభిషేక్‌ మహర్షి దర్శకత్వంలో ‘ప్రేమ్‌కుమార్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తయింది. రాశీ సింగ్‌ కథానాయిక. మరోవైపు మెహ్రీన్‌ సైతం పలు సినిమాలకు సంతకాలు చేసింది. ఆమె అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 3’ చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని