Manchu Vishnu: ‘జిన్నా’ హంగామా

విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘జిన్నా’. పాయల్‌  రాజ్‌పూత్, సన్నీలియోన్‌ కథానాయికలు. సూర్య   దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఆగస్ట్‌ 25న విడుదల చేయనున్నట్టు

Updated : 19 Aug 2022 06:57 IST

విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘జిన్నా’. పాయల్‌  రాజ్‌పూత్, సన్నీలియోన్‌ కథానాయికలు. సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఆగస్ట్‌ 25న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ‘‘వాణిజ్య ప్రధానంగా సాగే సినిమా ఇది. కోన వెంకట్‌ సమకూర్చిన కథ, కథనాలతో ఇంటిల్లిపాదినీ మెప్పించేలా తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రేమ్‌ రక్షిత్, అనూప్‌ రూబెన్స్‌ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకి ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని