Meenakshi chaudhary: దుల్కర్‌కు జోడీగా మీనాక్షి

మీనాక్షి చౌదరి తెలుగులో వరుస అవకాశాలతో జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆమె మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో ఓ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 15 Sep 2023 14:03 IST

మీనాక్షి చౌదరి తెలుగులో వరుస అవకాశాలతో జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆమె మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో ఓ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు వరుణ్‌ తేజ్‌కు జోడీగా ‘మట్కా’లోనూ, విష్వక్‌ సేన్‌ సరసన మరో కొత్త చిత్రంలోనూ కనిపించనుంది. అయితే ఇప్పుడీ నాయిక ఖాతాలో మరో పాన్‌ ఇండియా సినిమా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. అదే దుల్కర్‌ సల్మాన్‌ - వెంకీ అట్లూరి కలయికలో రూపొందనున్న ‘లక్కీ భాస్కర్‌’ అని సమాచారం. నిజానికి ఈ సినిమా కోసం నాయికగా తొలుత సాక్షి వైద్య పేరు బలంగా వినిపించినా.. ఆఖరికి చిత్ర బృందం మీనాక్షిని ఖాయం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. సినిమా చేసేందుకు ఆమె అంగీకారం తెలిపిందని టాక్‌. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు