Naresh: సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన నరేశ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని(Tollywood) సినీ కార్మికులు వేతనాలను పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బుధవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే...
వీడియో రిలీజ్ చేసిన నటుడు
హైదరాబాద్: వేతనాలను పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలోని(Tollywood) సినీ కార్మికులు బుధవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సినీ కార్మికులు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై నటుడు నరేశ్ (Naresh) స్పందించారు. కరోనా కారణంగా మూడేళ్ల నుంచి చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోందని, ఇలాంటి సమయంలో సమ్మెబాట పట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం నరేశ్ కొన్ని వీడియోలు షేర్ చేశారు.
‘‘నిన్నటి నుంచి ఎక్కడ చూసినా సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయనే వార్తలు కనిపిస్తున్నాయి. యూనియన్లు వేతనాలు పెంచకపోవడం వల్ల షూటింగ్స్ ఆపేస్తామంటూ కార్మికులు పోరాటం చేస్తున్నారని తెలిసింది. అందరికి మంచి జరిగేలా పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంతోపాటు సినీ పరిశ్రమ కూడా దెబ్బతింది. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. తెలుగు చిత్రపరిశ్రమకు అంతటా మంచి పేరు వస్తోంది. మనందరి బ్యాంకు ఖాతాలు డబ్బులతో నిండకపోయినా.. కనీసం మనందరి కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. సమ్మె గురించి విని నిర్మాతలు, దర్శకులు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇండస్ట్రీ బిడ్డగా నేను కోరేది ఒక్కటే.. నిర్మాతలు కూడా కరోనా సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వడ్డీలు కట్టలేని పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాస్త స్థిరపడుతున్నారు. ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఒక వారం లేదా పదిరోజులు సమయం తీసుకుని, ఫెడరేషన్, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు. కృష్ణానగర్, ఫిలింనగర్‌కు ఉన్న దూరం 3 కిలోమీటర్లు. అందరం కలిస్తేనే ఒక కుటుంబం. అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకువస్తాం. ఇండస్ట్రీ బిడ్డగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. పెద్దలందరం కలిసి నిర్ణయం తీసుకుని.. సినీ పరిశ్రమ మరోసారి అంధకారంలోకి వెళ్లకుండా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నా’’ అని నరేశ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్‌కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్‌బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..