Nayantara: మనసు చెప్పినట్టు వింటే మీరూ సూపర్‌స్టారే!

‘మీరు మీ మనసు చెప్పినట్టు నడుచుకుంటే మిలియన్‌లో ఒక్కరు మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి సూపర్‌స్టార్‌గా మారవచ్చు’ అని అంటోంది కథానాయిక నయనతార.

Updated : 29 Nov 2023 09:36 IST

‘మీరు మీ మనసు చెప్పినట్టు నడుచుకుంటే మిలియన్‌లో ఒక్కరు మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి సూపర్‌స్టార్‌గా మారవచ్చు’ అని అంటోంది కథానాయిక నయనతార. మరి ఆమె ఏ విషయంలో సూపర్‌స్టార్‌గా మారాలనుకుంటోంది? దీని కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అనేది తెలియాలంటే ‘అన్నపూరణి’ చూడాల్సిందే. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. నీలేష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అన్నపూరణి పాత్రలో కనిపించనుంది నయన. ‘పగటి కలలు కనొద్దు. ప్రతి వీధి క్రికెట్‌ ఆటగాడు సచిన్‌ తెందూల్కర్‌ కాలేడు. అలాగే ప్రతి బస్‌ కండక్టర్‌ సూపర్‌ స్టార్‌ కాలేడు’ లాంటి సంభాషణలతో సాగుతున్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి... ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందో ఈ సినిమాలో చూపించనున్నారు. సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని