Nayanthara: నయన కల నెరవేరిందా?

‘జవాన్‌’ సినిమాలో తన యాక్షన్‌తో అదరగొట్టిన నాయిక నయనతార.. ఇప్పుడు ‘అన్నపూరణి’గా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది.

Updated : 19 Nov 2023 11:43 IST

‘జవాన్‌’ సినిమాలో తన యాక్షన్‌తో అదరగొట్టిన నాయిక నయనతార.. ఇప్పుడు ‘అన్నపూరణి’గా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది ఉపశీర్షిక. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నీలేష్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. శనివారం నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఉలగై వెల్ల పొగిరాల్‌’ అనే మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నయన పాత్ర గురించి చెప్తూ.. తను కలలు కనడమే కాదు.. వాటిని నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తుంది. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. మాంసాహార వంటలకు సంబంధించిన రెస్టారెంట్‌ పెట్టుకోవాలనుకున్న తన కలను నెరవేర్చుకుందో? లేదో ఈ సినిమాలో చూపించబోతున్నారు.


‘టెస్ట్‌’.. కొత్త లుక్‌

యనతార, ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టెస్ట్‌’. ఎస్‌.శశికాంత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ సినిమాలోని ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని