Nayanthara Vignesh: నయన్‌-విక్కీ పెళ్లి కార్డు ఇదేనా..?

అగ్రకథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ త్వరలో పెళ్లి చేసుకోన్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల...

Updated : 07 Dec 2022 16:10 IST

పెళ్లి వేదిక ఇక్కడ కాదు.. అక్కడే

చెన్నై: నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తిరుమల సన్నిధిలో వీరి వివాహం వచ్చే నెల 9న జరగనుందని మొన్నటి వరకూ ప్రచారం జరగ్గా.. తాజాగా వేదిక మారినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుందని.. ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. వివాహానికి ఆహ్వానిస్తూ నయన్‌-విఘ్నేశ్‌ ఇప్పటికే తమ స్నేహితులదరికీ ఓ వీడియో ఇన్విటేషన్‌ పంపించారని.. అది ఇదేనంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇన్విటేషన్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. జూన్‌ తొమ్మిదిన మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఆ తర్వాత ఇండస్ట్రీ మిత్రుల కోసం చెన్నైలో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరిగే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్‌. సుమారు ఏడేళ్ల నుంచి నయన్‌-విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నారు. తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ విఘ్నేశ్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. కరోనా సమయంలో తమ నిశ్చితార్థమైపోయిందని ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో నయన్‌ బయటపెట్టారు. దీంతో నయన్‌-విఘ్నేశ్‌ పెళ్లి కోసం అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని