New movies telugu: ఈ వారం థియేటర్‌లో ఏకంగా పది సినిమాలు.. మరి ఓటీటీలో?

Telugu Movies: ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల సమాహారం మీకోసం..

Published : 17 Jul 2023 09:38 IST

సరికొత్త కథతో..

అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’ (Hidimbha). అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై  20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భారతీయ చిత్రాల్లో ఇదివరకు ఎప్పుడూ స్పృశించని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది. థ్రిల్లింగ్‌ అంశాలు ఆకట్టుకుంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది.


90ల నేపథ్యంతో..

చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో, అందమైన లొకేషన్స్‌తో, ఆకట్టుకునే మ్యూజిక్‌తో తెరకెక్కించాం. కథ 90వ దశకంలో సాగుతుంది. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. జులై 21న ఈ సినిమా విడుదల కానుంది’ అని చిత్ర బృందం తెలిపింది.


‘హత్య’ గుట్టు వీడేదప్పుడే!

ఇటీవలే ‘బిచ్చగాడు-2’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు విజయ్‌ ఆంటోని. ఇప్పుడీ జోష్‌లోనే ‘హత్య’ చిత్రంతో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.


అణు బాంబు పడితే..

ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్‌ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రముఖ భౌతికశాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది.


శక్తిమంతమైన పోలీసు అధికారి పాత్రలో..

రుహానీ శర్మ కీలక పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.


అది అలా ఎలా?

ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. కొల్లకుంట నాగరాజు నిర్మాత. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది.  ‘‘ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. స్క్రీన్‌ప్లే చాలా బాగా వచ్చింది. అందరూ ఈ చిత్రం చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం’’ అని చిత్ర బృందం చెబుతోంది.






ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్) జులై 19
  • స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3) జులై 20
  • దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) జులై 21
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • బవాల్‌ (హిందీ) జులై 21


  • జీ5
  • ఎస్టేట్‌ (తమిళ) జులై 16
  • స్పైడర్‌మాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) జులై 18
  • జియో సినిమా
  • ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) జులై 21
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని