Mission Impossible: ఏడాది ఆలస్యంగా..

టామ్‌ క్రూజ్‌ నటించిన ‘మిషన్‌: ఇంపాజిబుల్‌’ చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’, ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 8’ చిత్రాలు...

Updated : 23 Jan 2022 06:58 IST

టామ్‌ క్రూజ్‌ నటించిన ‘మిషన్‌: ఇంపాజిబుల్‌’ చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’, ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 8’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టామ్‌ క్రూజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలను క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ తెరకెక్కిస్తున్నారు. పారామౌంట్‌ పిక్చర్స్‌, స్కైడాన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు చిత్రాల్లో.. 7వ సీక్వెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న, 8వ సీక్వెల్‌ను వచ్చే ఏడాది జులై 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల వల్ల చిత్రీకరణలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. ‘మిషన్‌: ఇంపాజిబుల్‌7’ను వచ్చే ఏడాది జులై 14న, ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 8’ను 2024 జూన్‌ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని