ప్రమోషన్స్‌లో నయా ట్రెండ్‌.. ప్రచారం కావాలంటే స్టేజ్‌పై కెమిస్ట్రీ పండాల్సిందే..!

‘ఖుషి’ (Kushi), ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) ప్రమోషన్స్‌లో భాగంగా రెండు వీడియోలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 17 Aug 2023 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా ప్రమోషన్స్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టింది పేరు. సినిమా విడుదలవుతుందంటే.. దానికి బజ్‌ క్రియేట్‌ చేయడం కోసం చేసే కార్యక్రమాలు కోకొల్లలు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటీనటులు డైలాగ్స్‌ చెప్పడం, వేసి.. వేయనట్టు.. చిన్నపాటి స్టెప్పులు.. ఇవి సర్వసాధారణం. కానీ, ఇప్పుడు కాస్త ట్రెండ్‌ మారింది. తమ చిత్రాన్ని మార్కెటింగ్‌ చేసేందుకు నటీనటులు స్టేజ్‌పై డ్యాన్స్‌లు చేసి ఆకట్టుకుంటున్నారు. వాళ్ల కెమిస్ట్రీ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా జరిగిన రెండు సినిమా ఈవెంట్స్‌ ఇందుకు నిదర్శనం.

విజయ్‌ - సమంత కెమిస్ట్రీ.. ఫ్యాన్స్‌ ఖుషి..!

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) కొత్తగా పెళ్లైన జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సాంగ్స్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ క్రియేట్‌ చేశాయి. సినిమా విడుదల దగ్గర కానున్న తరుణంలో చిత్రబృందం ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేసింది. ఆగస్టు 15న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ అంతా ఒక్కెత్తు అయితే విజయ్‌-సామ్‌ డ్యాన్స్‌ మరొక ఎత్తు. ‘ఖుషి’ టైటిల్‌ సాంగ్‌కు వీరిద్దరూ స్టేజ్‌పై వేసిన స్టెప్పులు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ జోడీ గ్రేస్‌ గురించే ఇప్పుడు నెట్టింట టాక్‌ నడుస్తోంది.

విజయ్‌ దేవరకొండ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పిన సమంత

విశ్వక్‌ - నేహా హుక్‌ స్టెప్‌.. ట్రెండింగ్‌..!

విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) - నేహాశెట్టి (Neha Shetty) జంటగా నటిస్తోన్న ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari). మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. కృష్ణ చైతన్య దర్శకుడు. ఇందులో విశ్వక్‌.. మునుపెన్నడూ లేని విధంగా రఫ్‌ లుక్‌లో కనిపించనున్నారు. డిసెంబర్‌ 8న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసూ కోవే సీరలా’ అంటూ సాగే ఈ పాటకు సినిమాలో విశ్వక్‌-నేహాపై ఓ హుక్‌ స్టెప్‌ పెట్టారు. కాగా, ఆ హుక్‌ స్టెప్‌ను ఈ జోడీ సాంగ్‌ లాంచ్‌లో స్టేజ్‌పై చేసి చూపించారు. నేహా, విశ్వక్‌ చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని