Nidhi Agarwal: ‘హరిహర వీరమల్లు’ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి!

పవన్‌కల్యాణ్‌(pawan kalyan) కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’.

Published : 13 Jan 2022 11:14 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌(pawan kalyan) కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. వరుస చిత్రాలు, కరోనా ఎఫెక్ట్‌తో పవన్‌ ఈ సినిమాకు కొంత విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తాజాగా నిధి అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన మెయిన్‌ పాయింట్‌ను చెప్పేసింది.

పవన్‌కల్యాణ్‌తో నటించడం తన అదృష్టమని, ఈ సినిమా కోసం యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నానని తెలిపింది. అంతేకాదు, ఇది రెండు కాలాల మధ్య సాగే కథ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. అంటే పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు పాత్రతో పాటు, మరో పాత్రలోనూ సందడి చేసే అవకాశం ఉంది. ఇది పూర్తి పీరియాడికల్‌ చిత్రమే అయినా రెండు వేర్వేరు కాలాల్లో జరిగే కథ అని నిధి చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పవన్‌ ప్రస్తుతం ‘భీమ్లానాయక్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని