Nithiin: యాక్షన్‌ డ్రామాతో..

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ తుదిదశకు చేరుకొంటోంది. డిసెంబర్‌లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 21 Aug 2023 13:48 IST

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ తుదిదశకు చేరుకొంటోంది. డిసెంబర్‌లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కొత్త ప్రాజెక్టు కోసం నితిన్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఆయన శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘వకీల్‌సాబ్‌’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీరామ్‌ వేణు. ఆయన మలిచిన యాక్షన్‌ డ్రామా కథ నితిన్‌కి నచ్చడంతో సినిమా పక్కా అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించనున్నారు. కథానాయిక, ఇతర నటుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని