Tamannaah: శివశక్తి.. ఢమరుకం పట్టి

‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 09 Mar 2024 10:28 IST

‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా నుంచి తమన్నా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో ఆమె నాగ సాధువులా వేషం ధరించి.. ఒక చేతిలో దండము.. మరో చేతిలో ఢమరుకము పట్టుకొని ఆసక్తికరంగా కనిపించింది. తను ఇందులో శివశక్తి పాత్ర పోషిస్తున్నట్లు ఈ పోస్టర్‌తో స్పష్టత ఇచ్చారు. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనే ఆసక్తికర అంశంతో ఈ చిత్రం రూపొందనుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తున్నారు. ఎస్‌.సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని