Ram charan: రామ్‌ చరణ్‌కు మరో గౌరవం.. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చోటు..

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan)కు మరో అరుదైన గౌరవం దక్కింది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.

Published : 02 Nov 2023 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోనూ సభ్యత్వం సాధించారు. ఈ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించింది.

అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి కొంతమంది కొత్త సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులకు దీనిలో చోటు కల్పించింది. ‘ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు’ అని అకాడమీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. కొత్తగా ఎంపిక చేసిన వారి పేర్లను వెల్లడించింది. ఇక ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ఇటీవల ఎన్టీఆర్‌ (NTR) కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

‘తంగలాన్‌’ అంటే అర్థమదే.. అందుకే బరువు తగ్గా: విక్రమ్‌

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథగా ఇది రూపొందుతోంది. చరణ్‌ సరసన కియారా అడ్వాణీ అలరించనుంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని