Pawan kalyan: పవన్ మేనియా.. థియేటర్లు హౌస్‌ఫుల్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawankalyan).. మార్కెట్లో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. మల్టీప్లెక్సైనా, మాస్ థియేటరైనా.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ పేరు, ఈయన బొమ్మ కనపడితే చాలు...
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawankalyan).. మార్కెట్లో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. మల్టీప్లెక్సైనా, మాస్ థియేటరైనా.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ పేరు, ఈయన బొమ్మ కనపడితే చాలు అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకే ఈయన సినిమాలు ఎప్పుడు విడుదలైనా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద దర్శనమిస్తోంది.
కాగితాలు, డ్యాన్స్‌లు, బాక్సింగ్..!
పవన్‌కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్స్‌లో ఒకటిగా చెప్పుకునే సినిమా ‘తమ్ముడు’ (Thammudu). సెప్టెంబర్ 2 పవన్‌కల్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆగస్టు 31న పలు థియేటర్లలో ‘తమ్ముడు’ని రీ రిలీజ్ చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో దీన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన కొంత సమయానికే ఆయా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. థియేటర్ల వద్ద పవన్ అభిమానులు చేసిన సందడి కొత్త సినిమా రిలీజ్‌ని తలపించింది. సినిమా హాళ్ల ఎదుట భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. ‘జై పవన్‌కల్యాణ్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులందరూ డ్యాన్స్‌లు చేశారు. థియేటర్ల లోపల కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. పవన్ ఎంట్రీ సీన్స్, ‘మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్’ సాంగ్, క్లైమాక్స్ ఫైట్.. ఇలా ప్రతి సీన్‌కు అభిమానులు కాగితాలు ఎగురవేసి డ్యాన్స్‌లు చేశారు.
ఇప్పుడు ‘జల్సా’ వంతు..!
పవన్‌కల్యాణ్ నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం ‘జల్సా’ని (Jalsa) సెప్టెంబర్ 1న చిత్ర నిర్మాణ సంస్థ రీ రిలీజ్ చేసింది. ఈ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 501 కంటే ఎక్కువ షోలు వేస్తున్నారు. ‘జల్సా’ ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా ప్రసాద్ ఐమ్యాక్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సినిమాహాళ్లలో వేయనున్న అన్ని షోల టికెట్స్ అమ్ముడైపోయాయి. రీ రిలీజ్ చిత్రానికి ఇన్ని షోలు వేయడం.. ప్రతి చోటా ఇలాంటి అద్భుతమైన స్పందన రావడం విశేషమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక, ‘తమ్ముడు’, ‘జల్సా’ రీ రిలీజ్‌లను పురస్కరించుకుని సోషల్‌మీడియాలో పవన్ పేరు ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. పలు వీడియోలు వైరల్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!