Pooja Hegde: ‘సీతారామం’ హిట్‌.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు

‘యుద్ధం రాసిన ప్రేమకథ’గా సిద్ధమై అందరి హృదయాలను హత్తుకుంటోన్న ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు....

Published : 08 Aug 2022 02:19 IST

హైదరాబాద్‌: ‘యుద్ధం రాసిన ప్రేమకథ’గా సిద్ధమై అందరి హృదయాలను హత్తుకుంటోన్న ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమా విజయం పట్ల సినీ ప్రముఖులందరూ చిత్రబృందాన్ని మెచ్చుకుంటుండగా.. నెటిజన్లు మాత్రం ఓ స్టార్‌ హీరోయిన్‌పై జాలి కనబరుస్తున్నారు. అయ్యో పాపం అంటూ ఆమె గురించి పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు? నెటిజన్లు అంతగా సానుభూతి చూపించడానికి కారణమేమిటంటే..?

విజయ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా దక్షిణాది స్టార్‌హీరోలందరితో కలిసి వర్క్ చేసి అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్నారు నటి పూజాహెగ్డే. ‘అల.. వైకుంఠపురములో’ విజయం తర్వాత ఆమె కెరీర్‌ ఎంతో మారింది. సౌత్‌, బాలీవుడ్‌లోనూ ఆమె వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సమయంలో ఆమె వద్దకు ‘సీతారామం’ కథ వెళ్లింది. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో ప్రతిఒక్కర్నీ ఆకర్షించేలా సిద్ధమైన ఈ సినిమాలోని కీలక పాత్రకు పూజా అయితే సరైన న్యాయం చేయగలదని భావించిన దర్శకుడు హను.. ఆమెను కలిసి కథ చెప్పారట. కథ నచ్చినప్పటికీ.. మిగతా సినిమాల షూట్స్‌ వల్ల డేట్స్‌ సర్దుకాకపోవడంతో ఆమె ఈ చిత్రాన్ని వదులుకున్నారట. అలా, ఈ ప్రేమకథ బాలీవుడ్‌ నటి మృణాలిని, మరో కీలక పాత్రలో రష్మిక అలరించారు. ముఖ్యంగా సీతగా వెండితెరపై మృణాల్‌ పండించిన హావభావాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాతో మృణాల్‌ ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక, ‘సీతారామం’ విడుదలై.. సూపర్‌హిట్‌ అందుకోవడంపై పలువురు నెజటిన్లు ఆనందం వ్యక్తం చేస్తూనే పూజా ఈ సినిమాలో నటించకపోవడంపై బాధగా ఉన్నట్లు చెబుతున్నారు. ‘‘పాపం పూజాహెగ్డే మంచి హిట్‌ వదులుకుంది’’ అని వరుస పోస్టులు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని