Radheshyam: ఇక ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టండమ్మా..!
ప్రేమ, విధికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈసినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి ఎన్నో ప్రచారాల...
రిలీజ్‌పై చిత్రబృందం ఫుల్ క్లారిటీ
హైదరాబాద్: ప్రేమ, విధికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈసినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల నెట్టింట్లో గట్టి ప్రచారమే జరిగింది. కాగా, ఆ ప్రచారాలన్నింటికీ చిత్రబృందం బుధవారం ఉదయం ఫుల్స్టాప్ పెట్టింది. థియేటర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘భీమ్లానాయక్’ చిత్రబృందాలు మరోసారి రిలీజ్ డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నింపాయి. ఈ తరుణంలో తాజాగా ‘రాధేశ్యామ్’ టీమ్ విడుదల తేదీని ప్రకటించేసింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. చిత్రబృందం ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇకనైనా ఓటీటీ రిలీజ్ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టండమ్మా’ అని పోస్టులు పెడుతున్నారు. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక, పూజాహెగ్డే ప్రేరణగా అలరించనున్నారు. అనుకోకుండా ప్రేమలో పడిన వీరిద్దరిని విధి ఒక్కటి చేసిందా? లేక దూరం చేసిందా? ప్రేమను గెలుచుకునేందుకు వీరిద్దరూ విధితో చేసిన పోరాటమేమిటి? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరదా సరదాగానే సిక్స్‌లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్‌లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్‌స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం