Prabhas: అందుకే ‘సలార్‌’కు ఓకే చెప్పా.. పార్ట్‌ 2 మరింత అద్భుతంగా ఉంటుంది : ప్రభాస్‌

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ భారీ హిట్‌ సొంతం చేసుకుంది. దీనిపై ప్రభాస్‌ (Prabahs) స్పందించారు.

Updated : 25 Dec 2023 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘సలార్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. తాజాగా ఓ హాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘సలార్‌’(Salaar) కథ నాకెంతో నచ్చింది. విన్న వెంటనే అంగీకరించాను. నాకెరీర్‌లో చేసిన భిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి. ఎంతో సవాలుతో కూడుకున్నది. ‘బాహుబలి’ నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నా. అందులో భాగంగానే ‘సలార్‌’కు ఓకే చెప్పాను. అలాగే ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ అని కాకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్‌నీల్‌ వంటి దర్శకులతో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. సలార్‌ పార్ట్‌ 1 చివరిలోనే రెండో భాగం ఉంటుందని స్పష్టం చేశాం. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండోది మరింత అద్భుతంగా ఉంటుంది’’ అని ప్రభాస్‌ చెప్పారు.

ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు.. ఓటీటీలో అలరించే చిత్రాలు!

ఇక ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ అంచనాలు అందుకుని భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), సందీప్ వంగా తో ‘స్పిరిట్‌’లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని