Telugu Movies: ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు.. ఓటీటీలో అలరించే చిత్రాలు!

ఈ క్రిస్మస్‌కు భారీ చిత్రాలు థియేటర్‌లో సందడి చేశాయి. ‘సలార్‌’ హవా ఈ వారమూ కొనసాగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో కొత్త ఏడాది రాబోతున్న వేళ.. ఈ ఏడాది ఆఖరిగా బాక్సాఫీస్‌ను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి.

Published : 25 Dec 2023 09:51 IST

బ్రిటిష్ ఏజెంట్‌ ఏం చేశాడు?

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘డెవిల్‌’ (Devil Movie).  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మేనన్‌, మాళవిక నాయర్‌ నటించారు. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే పీరియాడిక్‌ చిత్రమిది. బ్రిటిష్‌ రహస్య గూఢచారిగా కల్యాణ్‌రామ్‌ ఆకట్టుకునేలా నటించారు. ఆయన చేసే స్టైలిష్‌ పోరాట ఘట్టాలు, కథలోని డ్రామా, థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి.  విజువల్స్‌ మరో మరోస్థాయిలో ఉంటాయ’’ని సినీవర్గాలు తెలిపాయి.


బబుల్‌గమ్‌.. ప్రేమకథ

రాజీవ్‌ కనకాల, సుమ దంపతుల తనయుడు రోషన్‌ కనకాల ‘బబుల్‌గమ్‌’ (bubble gum)సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఈ సినిమా కూడా డిసెంబరు 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘ఈ చిత్రానికి ప్రతిభావంతులైన యువ బృందం పని చేసింది. రోషన్‌, మానస చాలా గ్రేస్‌తో ఈ పాత్రల్ని పోషించారు. వారు తమ పాత్రల్ని అర్థం చేసుకున్న తీరు నన్ను చాలా సర్‌ప్రైజ్‌ చేసింది’’ అని చిత్ర బృందం చెబుతోంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

  • నెట్‌ఫ్లిక్స్‌
  • స్నాగ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 25
  • ఖో గయే హమ్‌ కహా (హిందీ) డిసెంబరు 26
  • లిటిల్‌ డిక్సీ (హాలీవుడ్) డిసెంబరు 28
  • అన్నపూరణి (తమిళ) డిసెంబరు 29
  • బెర్లిన్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 29
  • శాస్త్రి (చిత్రం) డిసెంబరు 29
  • బీస్ట్‌ (మూవీ) డిసెంబరు 31
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ఇట్టూసీ బాత్‌ (హిందీ) డిసెంబరు 24
  • జీ5
  • డోనో (హిందీ) డిసెంబరు 29
  • సఫేద్‌ (హిందీ) డిసెంబరు 29
  • వన్స్‌ అప్‌ఆన్‌ టూ టైమ్స్‌ (హిందీ) డిసెంబరు 29
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మంగళవారం (తెలుగు) డిసెంబరు 26
  • 12thఫెయిల్‌ (హిందీ) డిసెంబరు 29
  • ఆహా
  • కీడా కోలా (తెలుగు) డిసెంబరు 28
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • ది కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 29
  • జియో సినిమా
  • ఆస్టరాయిడ్‌ సిటీ (హాలీవుడ్‌) డిసెంబరు 25
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని