Published : 27 Jan 2022 13:51 IST

Puri Musings: వూ వై సిద్ధాంతం గురించి తెలుసా?

హైదరాబాద్‌: వివిధ అంశాలపై ‘పూరీ మ్యూజింగ్స్‌’ (Puri Musings) వేదికగా తన అభిప్రాయాన్ని బయటపెడుతుంటారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. తాజాగా ఆయన వూ వై అనే చైనీస్‌ సిద్ధాంతంపై తన ఆలోచనలు వెల్లడించారు. ఇంతకీ ‘వూ వై’ సిద్ధాంతమంటే ఏమిటి? దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనే ఆసక్తికర విశేషాలను ఆయన చెప్పుకొచ్చారు.  

‘‘WU WEI (వూ వై) ఇది చైనీస్‌ సిద్ధాంతం. వు వై అంటే ఏమీ చేయకుండా ఉండటం. ఏమీ చేయకుండా ఉండటం అంటే బద్ధకించడం అనుకోవచ్చు.. కానీ కాదు. ఇది దావోఇజం (Daoism) ఫిలాసఫీ నుంచి వచ్చింది. Dao అంటే ది వే అని అర్థం. ఏ పని చేసినా ఏదో చేయాలని చేయకూడదు. ఇంకా చేయాల్సింది చాలా ఉందనే ఉద్దేశంతో చేయకూడదు. ఏ పనైనా మెల్లగా చేసుకుంటూ వెళ్లడం. ఒక పనిచేస్తూ సంతోషంగా పూర్తి శ్రద్ద్ధ పెట్టి దాన్ని ఎంజాయ్‌ చేస్తూ వెళ్లడం. ఈ వూ వై సిద్ధాంతం ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. ఈ సిద్ధాంతం ఫాలో అవ్వాలంటే మన ప్రవర్తన చాలా చురుగ్గా, సహజంగా ఉండాలి. మనకి ప్రకృతికి ఒక అనుబంధం ఉండాలి’’

‘‘ఉదాహరణకు మనం నీళ్లలా ఉండాలి. ప్రవహించే నీరు ఎన్ని బండరాళ్లకు కొట్టుకున్న దానికి ఏమీ కాదు. అదే మాదిరిగా మనం జీవించాలి. మనకి వచ్చే సమస్యలను బట్టి మన స్వభావం మార్చుకుంటూ వెళ్లాలి. అలా మార్చుకోగలిగితే మనల్ని ఏదీ ఇబ్బందిపెట్టలేదు. బీ వాటర్‌ మై ఫ్రెండ్‌ అని బ్రూస్లీ చెబుతుంటాడు.. ఆ ఐడియా కూడా దావోఇజం నుంచి వచ్చిందే. ఈ వూ వై ప్రాక్టీస్‌ చేసేవాళ్లు దేనికి తొణకరు, బెణకరు. ఈ వూ వైని తాగుబోతుతో పోలుస్తారు. తాగుబోతు మైండ్‌ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదే లక్షణం అప్పుడే నడక నేర్చుకునే పిల్లల్లో కూడా చూడొచ్చు. వూ వై ప్రాక్టీస్‌ చేయాలనుకుంటే డ్రాయింగ్‌, పెయింటింగ్‌, కలరింగ్‌తో ప్రారంభించమని దావోఇజం చెబుతుంది. వూ వై ఆర్టిస్టులు డ్రాయింగ్‌ వేస్తే కంటికి కనిపించే ప్రకృతిని డ్రా చేస్తారు తప్ప.. ఊహాజనితంగా బొమ్మలు వేయరు. వూ వై అంటే మీరు ఏం పని చేసినా అప్రయత్నంగా ఉండాలి. అందులో టైం తెలియదు. పని కాలేదనే బాధ కూడా ఉండదు. కానీ, పూర్తైన తర్వాత ఆ పని ఎంతో అందంగా కనిపిస్తుంది’’ అని పూరీ జగన్నాథ్‌ వివరించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని