Gaami: విశ్వక్‌సేన్‌ ‘గామి’పై రాజమౌళి పోస్ట్‌.. ఏమన్నారంటే!

‘గామి’పై దర్శకధీరుడు రాజమౌళి పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

Published : 06 Mar 2024 13:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీని ట్రైలర్‌పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి (ss Rajamouli) దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఓటీటీలో ‘భ్రమయుగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్‌ అఘోరాగా కనిపించనున్నారు. మార్చి 8న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఇక దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడంపై విశ్వక్ సేన్ తాజాగా మాట్లాడారు. ‘‘రిషబ్‌ శెట్టి నటించిన ‘కాంతార’ కూడా మొదట ఒక్క భాషలోనే విడుదలైంది. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజై సూపర్‌ సక్సెస్‌ అయింది. మేము ‘గామి’ విషయంలో అదే ఫాలో అవుతాం. దీనికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి మిగతా భాషల్లో విడుదల చేస్తాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకముంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని