Rajinikanth: ‘జైలర్‌’ రిలీజ్‌.. థియేటర్‌లో ధనుష్‌, అనిరుధ్‌, లతా రజనీ సందడి

రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన సరికొత్త చిత్రం ‘జైలర్‌’ (Jailer). గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Published : 10 Aug 2023 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajiniknath) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dileep Kumar) దర్శకుడు. మాఫియా, ప్ర‌తీకార నేప‌థ్యం, కుటుంబ అంశాల మేళ‌వింపుగా రూపొందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి క‌థతో ఇది సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేస్తున్నారు. ముత్తు పాత్రలో రజనీ నటన అత్యద్భుతంగా ఉందని, చాలారోజుల తర్వాత ఆయన్ని పవర్‌ఫుల్‌ రోల్‌లో చూడటం ఆనందంగా ఉందంటూ నెట్టింట కామెంట్స్‌ పెడుతున్నారు. చిత్ర దర్శకుడు నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రివ్యూ: ‘జైలర్‌’.. రజనీకాంత్‌ కొత్త మూవీ ఎలా ఉందంటే?

చెన్నైలోని ఓ థియేటర్‌లో రజనీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం, రజనీ సతీమణి లత, కుమార్తెలు భారీ కేక్‌ను కట్‌ చేశారు. సినిమా పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు నటుడు ధనుష్‌ సైతం చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ‘జైలర్‌’ను వీక్షించారు. ఓ థియేటర్‌లో అనిరుధ్‌ ‘జైలర్‌’ పాట పాడి అలరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

2021లో విడుదలైన ‘అన్నాత్తె’ తర్వాత రజనీ నటించిన చిత్రం ‘జైలర్‌’. రమ్యకృష్ణ, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, యోగిబాబు, సునీల్‌, నాగబాబు తదితరులు ఈ సినిమాలో నటించారు. మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో మెరిశారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని