Naatu Natu: నాటునాటు హుక్‌ స్టెప్పేసిన సచిన్‌, హీరో సూర్య... వైరల్‌ అవుతోన్న వీడియో

భారత్‌కు ఆస్కార్‌ అవార్డు తెచ్చిపెట్టిన ‘నాటునాటు’ పాటకు సచిన్‌, హీరో సూర్య స్టెప్పు లేశారు.

Published : 06 Mar 2024 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు ఆస్కార్‌ తెచ్చిపెట్టిన హిట్‌ సాంగ్‌ ‘నాటునాటు’. ఈ పాట టాలీవుడ్ అగ్ర కథానాయకులు రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రం లోనిది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. గతంలో ఈ పాటకు పలువురు ప్రముఖులు, సోషల్‌మీడియా యూజర్స్‌ రీల్స్‌ చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ల ‘బడేమియా ఛోటేమియా’ చిత్రంలోని ఓ పాటలో ఈ హుక్‌ మూమెంట్‌ కనిపించింది. తాజాగా వాంఖండే స్టేడియంలోనూ ఈ పాట వినిపించింది. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, తమిళ నటుడు సూర్య, రామ్‌చరణ్‌, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌, బొమన్‌ ఇరానీలు నాటునాటు హుక్‌స్టెప్‌తో ప్రేక్షకులని అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌-రాధికా మర్చెంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లోనూ ఈ పాట అలరించింది. బాలీవుడ్‌ ఖాన్స్‌ త్రయం చేసిన డాన్స్‌ చూస్తూ సినీ ప్రియులంతా తెగ సంబరపడ్డారు. సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, రామ్‌చరణ్‌ చేసిన డాన్స్‌ వీడియో అందరినీ ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని