Ram Charan: ఆటనే మార్చేస్తాడు

శంకర్‌ సినిమా అంటే హంగులకి కొరతే ఉండదు. ప్రతీ సన్నివేశం లార్జన్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టే ఉంటుంది. అందుకోసం రాజీ పడకుండా చిత్రీకరణ చేస్తుంటారు.

Updated : 11 May 2023 14:09 IST

శంకర్‌ (Shankar) సినిమా అంటే హంగులకి కొరతే ఉండదు. ప్రతీ సన్నివేశం లార్జన్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టే ఉంటుంది. అందుకోసం రాజీ పడకుండా చిత్రీకరణ చేస్తుంటారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కూడా అదే తరహాలోనే రూపొందుతోంది. ఈ సినిమాలోని పతాక సన్నివేశాల్ని హైదరాబాద్‌ పరిసరాల్లో తెరకెక్కించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారీ సెట్లో 1200 మందికిపైగా ఫైటర్లు, మరికొంత మంది జూనియర్‌ ఆర్టిస్టుల  నేపథ్యంలో ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్టు దర్శకుడు శంకర్‌ ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది.  కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు విడుదల లక్ష్యంగా సినిమా ముస్తాబవుతున్నట్టు సమాచారం. డిసెంబరు అనగానే క్రిస్మస్‌ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఈసారి క్రిస్మస్‌కి ఇప్పటికే నాని, వెంకటేష్‌ సినిమాలు ఖరారయ్యాయి. మరి ‘గేమ్‌ఛేంజర్‌’ గురి ఏ తేదీపైన అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని