Soul Of Sathya: ఆ త్యాగాలకి నివాళి ‘సోల్‌ ఆఫ్‌ సత్య’

‘‘మన రేపటి కోసం నేటి రోజుని త్యాగం చేస్తున్నారు సైనికులు. మరెన్నో త్యాగాలతో వాళ్లని సరిహద్దులకి పంపుతున్నారు తల్లులు, భార్యలు, తోబుట్టువులు. వాళ్లందరికీ నివాళులర్పిస్తూ రూపొందించిన గీతమే ‘సోల్‌ ఆఫ్‌ సత్య’.

Updated : 16 Aug 2023 14:06 IST

‘‘మన రేపటి కోసం నేటి రోజుని త్యాగం చేస్తున్నారు సైనికులు. మరెన్నో త్యాగాలతో వాళ్లని సరిహద్దులకి పంపుతున్నారు తల్లులు, భార్యలు, తోబుట్టువులు. వాళ్లందరికీ నివాళులర్పిస్తూ రూపొందించిన గీతమే ‘సోల్‌ ఆఫ్‌ సత్య’. ఇది అందరికీ చేరువ కావాలి’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కలర్స్‌ స్వాతితో కలిసి ఇందులో నటించారు. నవీన్‌ విజయకృష్ణ దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌, హన్షిత నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఈ పాటని ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ పాట తెలుగుతోపాటు, హిందీ, తమిళంలో విడుదలైంది’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని