Ranga Ranga Vaibhavanga: తెలుసా.. తెలుసా!
‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడాయన.. కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడాయన.. కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్య క్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈనెల 3న ‘‘తెలుసా.. తెలుసా’’ అనే పాట విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ ప్రచార చిత్రంలో వైష్ణవ్, కేతిక రొమాంటిక్ లుక్‌లో చూడముచ్చటగా కనిపించారు. ‘‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. వైష్ణవ్, కేతికల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: శ్యామ్ దత్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్‌కు గురిపెట్టి!
కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
పెళ్లి తేలికైన విషయం కాదు!
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
బాహుబలి నుంచి యానిమేటెడ్ సిరీస్
ప్రభాస్ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్ సిరీస్ రానుంది. -
సీమ కథతో తొలిసారి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో ఓ సినిమా చేయనున్నారు. -
అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు
‘కెరీర్లో జయాపజయాలు సహజం. అవి ఎంతమాత్రం నాపై ప్రభావం చూపించవు. ప్రేక్షకులు మెచ్చేలా నటించుకుంటూ వెళ్లడమే నా పని’ అంటోంది అలయా ఎఫ్. ఇటీవలే తను నటించిన ‘బడేమియా ఛోటేమియా’ భారీ వసూళ్లు రాబట్టడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా బదులిచ్చింది అలయా. -
వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. -
ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్‌స్ట్రోక్ క్లినిక్‌లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
-
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి