Rathnam: విశాల్‌- హరి కాంబో.. ఈసారి రక్తపాతమే.. టీజర్‌ చూశారా!

విశాల్‌ నటిస్తున్న 34వ సినిమా టైటిల్‌ ఖరారైంది. హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం పేరేంటంటే?

Published : 02 Dec 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భరణి’ (తమిళంలో.. Thaamirabharani) సినిమాతో హిట్‌ కాంబినేషన్‌గా నిలిచారు హీరో విశాల్‌ (Hero Vishal), డైరెక్టర్‌ హరి (Director Hari). ఈ కాంబోలో రెండో సినిమాగా ‘పూజ’ (Poojai) తెరకెక్కింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరూ ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ సినిమాకు ‘రత్నం’ (Rathnam) టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలియజేస్తూ ఫస్ట్‌ షాట్‌ టీజర్‌ విడుదల చేశారు. ఓ మైదానంలో వరుసగా లారీలు వెళ్తుంటే వాటి ముందు బర్రెలు, గుర్రాలు గుంపులుగా పరిగెత్తడం, దేవుడి విగ్రహాల ముందు ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని ఉండగా విశాల్‌ వెళ్లి అతడి తల నరకడం, నేలపై పడిన ఓ రక్తపు చుక్క ‘రత్నం’ టైటిల్‌గా మారడంవంటి సన్నివేశాలు వీడియోలో కనిపించాయి. దీన్నిబట్టి ఈసారి విశాల్- హరి తమ సినిమాలో రక్తపాతాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌ ‘సలార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. మరిన్ని అంచనాలు పెంచేలా..!

ఈ సినిమాలో విశాల్‌ సరసన ప్రియా భవానీ శంకర్‌ నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌- సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. విశాల్‌కు ఇది 34వ చిత్రం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్‌ ఇటీవల ‘మార్క్‌ ఆంటోని’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని