Ravanasura: ‘రావణాసుర’ కోసం రంగంలోకి
‘రావణాసుర’ సినిమా కోసం రంగంలోకి దిగారు కథానాయకుడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘రావణాసుర’ సినిమా కోసం రంగంలోకి దిగారు కథానాయకుడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రవితేజతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సెట్లోకి అడుగు పెట్టిన వీడియో, ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘విభిన్నమైన థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. రామ్ పాత్రలో సుశాంత్ కనిపిస్తారు. సినిమాలో ఐదుగురు నాయికలకూ ప్రాధాన్యముంటుంది’’ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది... బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్‌తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్‌గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!