RGV: వర్మ చెంప పగలగొట్టిన అషురెడ్డి.. ఏం జరిగింది?

ASHU REDDI: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో అషురెడ్డి ‘బోల్డ్‌ ఇంటర్వ్యూ’ ప్రోమో చూశారా?

Published : 03 Sep 2021 01:54 IST

హైదరాబాద్‌: సినిమాలతో పాటు, సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా వర్మ మాట్లాడిన మాటలకు నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డి ఆయన చెంప పగలగొట్టారు. అయితే, అదంతా నిజంగా కాదులెండి. ఇటీవల వర్మ ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ‘బోల్డ్‌ ఇంటర్వ్యూ’ అంటూ అరియానాతో వర్మ చేసిన సందడి చూశాం. ఇప్పుడు అషురెడ్డితో అలాంటి ఇంటర్వ్యూనే ప్లాన్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓ కెఫేలో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకుని, మాట్లాడేందుకు ప్రయత్నించగా, అషురెడ్డి ఏమీ తెలియనట్లు నటించారు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించే క్రమంలో వర్మ అన్న మాటలకు కోపం వచ్చిన అషు.. ఆయన చెంప పగలగొట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? వర్మ ఎలా రియాక్ట్‌ అయ్యారు? అసలు ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూ కథేంటి? తెలియాలంటే సెప్టెంబరు 7వ తేదీ వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని