Rorschach: మమ్ముట్టి సినిమా ఓటీటీలోకి ఎప్పుడంటే..!
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సైకలాజికల్ యాక్షన్ చిత్రం ‘రాస్‌చాక్’. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా నవంబర్ 11 నుంచి అలరించనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
హైదరాబాద్: మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి(Mammootty). తెలుగులోనూ మంచి సినిమాలు చేసి టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన చిత్రం రాస్‌చాక్(Rorschach). ఈ సినిమా ఇటీవల విడుదలై విజయం సాధించింది. ఈ మలయాళ సినిమా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా నవంబర్ 11 నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. నిషమ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ల్యూక్ ఆంటోని అనే పాత్రలో మమ్ముట్టి నటించారు. పూర్తిగా విభిన్న కథాంశంతో రూపొందిన సినిమా ఇది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. విదేశాల నుంచి వచ్చిన హీరో భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. స్పృహ వచ్చి చూశాక ఆమె పక్కన ఉండదు. అక్కడ నుంచి కథ మొదలవుతుంది. తర్వాత ఎన్నో మలుపులు తిరుగుతుందని అర్థమవుతోంది. యాక్సిడెంట్ ఎందుకు జరిగింది. చిత్రంలో ఉన్న అపరిచిత వ్యక్తి ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ
-
Ashwin: అదృష్టమంటే అశ్విన్‌దే.. అనుకోకుండా మళ్లీ ప్రపంచకప్ జట్టులో!