‘రాను రానంటూనే’ ‘సదా’ రానంది.. ‘అంజలి’ వచ్చింది.

ఇటీవల విడుదలైన ‘రాను రానంటూనే చిన్నదో’ డీజే రిమిక్స్‌ వెర్షన్‌(Ranu ranantune chinnado dj mix) ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla niyojakavargam)లోని ఐటెమ్‌ సాంగ్‌గా...

Updated : 07 Dec 2022 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలైన ‘రాను రానంటూనే చిన్నదో’ డీజే రిమిక్స్‌ వెర్షన్‌(Ranu ranantune chinnado dj mix) ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla niyojakavargam)లోని ఐటెమ్‌ సాంగ్‌గా విడుదలైన ఈ లిరిక్‌ సాంగ్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నితిన్‌(Nithin), అంజలిల(Anjali) స్టెప్పులు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ‘జయం’ చిత్రంలోని ఈ పాట అప్పట్లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ‘జయం’ పేరు చెబితే మనకు గుర్తొచ్చే నటి ‘సదా’. ఆ పాటలోని ‘సదా’ అభినయాన్ని ఇప్పటికి మర్చిపోలేని ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం సందడి చేస్తున్న ఈ రిమిక్స్‌ సాంగ్‌ మొదట సదా వద్దకే వెళ్లిందట. కానీ, ఆమె ఈ ఐటెమ్‌ సాంగ్‌లో నర్తించనని తేల్చి చెప్పిందట. అప్పుడు నితిన్‌ సరసన నటించి ఇప్పుడు ఐటెమ్‌ పాత్రలో నటించలేనని అందట. దాంతో చిత్ర యూనిట్‌ నటి అంజలీని సంప్రదించారట. ఆమె వెంటనే ‘యస్‌’ చెప్పడంతో ‘రాను రానంటూనే’ రీమిక్స్‌ వెర్షన్‌ మన ముందుకు వచ్చింది. ఈ పాటకు మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చారు. నితిన్‌, కృతిశెట్టి(Krithi shetty), కేథరిన్‌(Catherine)  ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని