Salman khan: సల్మాన్‌ఖాన్‌-సూరజ్‌ బర్జాత్యాలు మరోసారి

అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌, దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా కాంబినేషన్‌లో వచ్చిన ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించాయి.

Updated : 25 Sep 2023 14:06 IST

అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌, దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా కాంబినేషన్‌లో వచ్చిన ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఇద్దరికి కలయికలో మరో సినిమా పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని సూరజ్‌ బర్జాత్యా ఆదివారం ధ్రువీకరించారు. ‘వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సల్మాన్‌తో చిత్ర షూటింగ్‌ మొదలవుతుంది. నేను ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు పూర్తిగా స్వార్థపరుడిగా మారిపోతుంటా. కథ రాసుకోవడం, షూటింగ్‌ ప్రారంభించడం.. అన్నీ నాకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటా. సల్మాన్‌ఖాన్‌తో కలిసి పని చేయడం నాకు ఎప్పుడూ స్పెషలే. అందుకే అన్నీ కలిసొచ్చేలా ఆ సమయంలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాం’ అని ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు