Samantha: సమంత మొదటిసారి తీసుకున్న జీతం ఎంతో తెలుసా?

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అగ్ర కథానాయిక సమంత(samantha). ఇటు తెలుగుతో పాటు హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. నయనతార,

Published : 19 Apr 2022 02:34 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అగ్ర కథానాయిక సమంత(samantha). ఇటు తెలుగుతో పాటు హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ‘కాతువాక్కుల రెండు కాదల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

‘మీరు థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఏది’ అని అడగ్గా ‘జురాసిక్‌ పార్క్‌’ అని సామ్‌ సమాధానం ఇచ్చింది. అలాగే తనకు రొమాంటిక్‌ కామెడీ చిత్రాలంటే ఇష్టమని ‘కాతువాక్కుల రెండు కాదల్‌’అదే జోనర్‌లో తెరకెక్కిన చిత్రమని వివరించింది. తన ఇన్‌స్టాను 23మిలియన్ల మంది ఫాలో అవడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక తన మొదటి సంపాదన రూ.500 అని సమంత తెలిపింది. 10 లేదా 11వ తరగతిలో ఉండగా, ఒక కాన్ఫరెన్స్‌కు 8గంటలు హోస్ట్‌ చేస్తే, రూ.500 ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ సంతోషంగా ఉండాలని, ఉన్నంత కాలం ఉన్నతంగా బతకడమే తన కలని తెలిపింది.  టాటూస్‌ గురించి అడగ్గా,  తాను యువతిగా ఉన్న సమయంలో ఎప్పటికీ టాటూలు వేసుకోకూడదని అనుకున్నాననని, వాటి జోలికి అస్సలు పోవద్దని సూచించింది.(సామ్‌ తన శరీరంపై మూడు టాటూలు వేసుకున్న సంగతి తెలిసిందే.)

ప్రతి నిమిషం మీరు ఆనందంగా ఉండటానికి రహస్యం ఏంటి అని అడగ్గా, ఎలాంటి రహస్యం లేదని, రోజంతా సంతోషంగా ఉండాలని నిద్రలేవాలంటూ తెలిపింది. ‘మహిళలకు మీరిచ్చే సందేశం’ ఏంటి అని మరో అభిమాని అడగ్గా, ‘మిమ్మల్ని మీరు నమ్మండి. దేనికీ భయపడొద్దు. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్‌ అవ్వొద్దు. మీ కలలను సాకారం చేసుకోండి’ అని సమాధానం ఇచ్చింది. శారీరకంగా.. మానసికంగా తనని తాను దృఢంగా మార్చుకునేందుకు కఠిన కసరత్తులు సమంత చేస్తోంది. తాజాగా సామ్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో ఆమె వ్యక్తిగత ట్రైనర్‌ సమక్షంలో భారీ  బరువులు పైకెత్తుతూ కనిపించింది. దీనికి ‘స్ట్రాంగ్‌ బాడీ.. స్ట్రాంగర్‌ మైండ్‌’’ అంటూ ఓ స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యను జోడించింది. అంతే కాదు ‘‘లక్ష్యం.. 2022-23’’ అంటూ తన స్టేటస్‌లో పేర్కొంది. ఈ మాటల్ని బట్టి సామ్‌ తన జీవితంలో మరింత పైకి ఎదగాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో బిజీగా ఉంది. ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే విదేశీ చిత్రంలోనూ నటించనుంది. త్వరలో ఓ బాలీవుడ్‌ కబురు వినిపించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని