Shaakuntalam: ఋషి వనంలోన స్వర్గధామం.. హిమ వనంలోన అగ్నివర్షం

‘‘స్వయం వరమేదీ జరుగలేదే.. స్వయంగా తానే వలచినాడే.. చెరకు శరమే విసిరినాడే.. చిగురు యదనే గెలిచినాడే’’ అంటూ తన మనసు గెలిచి, వలచిన దుష్యంతుడితో కలిసి ప్రేమ గీతిక ఆలపిస్తోంది శకుంతల.

Updated : 26 Jan 2023 07:27 IST

‘‘స్వయం వరమేదీ జరుగలేదే.. స్వయంగా తానే వలచినాడే.. చెరకు శరమే విసిరినాడే.. చిగురు యదనే గెలిచినాడే’’ అంటూ తన మనసు గెలిచి, వలచిన దుష్యంతుడితో కలిసి ప్రేమ గీతిక ఆలపిస్తోంది శకుంతల. మరి వీళ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే ‘శాకుంతలం’ (Shaakuntalam) చూడాల్సిందే. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమ కావ్యం ఆధారంగా గుణశేఖర్‌ (Gunasekhar) రూపొందించిన చిత్రమిది. శకుంతలగా సమంత (Samantha) నటించగా.. దుష్యంతుడి పాత్రను దేవ్‌ మోహన్‌ (Dev Mohan) పోషించారు. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. బుధవారం ఈ సినిమాలోని ‘‘ఋషి వనంలోన స్వర్గధామం.. హిమ వనంలోన అగ్నివర్షం’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. శ్రీమణి సాహిత్యమందించారు. సిద్‌ శ్రీరామ్‌, చిన్మయి ఆలపించారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని