Shaakuntalam: ‘శాకుంతలం’ మరో కొత్త తేదీన

‘శాకుంతలం’ (Shaakuntalam) రాకకు కొత్త ముహూర్తం ఖరారైంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

Updated : 11 Feb 2023 06:51 IST

‘శాకుంతలం’ (Shaakuntalam) రాకకు కొత్త ముహూర్తం ఖరారైంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ కొత్త విడుదల తేదీని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో చిత్ర ప్రధాన తారాగణం మొత్తాన్ని చూపించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్‌ (Guna Sekhar) తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్‌ పాత్రను సమంత (Samantha) పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. మోహన్‌బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, నిర్మాత: నీలిమ గుణ, సమర్పణ: దిల్‌రాజు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని