Shah Rukh Khan: షారుఖ్ ఐకానిక్ పోజ్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందిలా
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఐకానిక్ పోజ్ తాజాగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముంబయి: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’లోని ఐకానిక్ పోజ్. ఆ సినిమా విడుదలై దాదాపు 28 ఏళ్లైనా.. షారుఖ్ ప్రతి ఫంక్షన్‌లోనూ ఈ పోజ్‌ను రీక్రియేట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడిదే పోజ్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. అదెలా అంటే..
షారుఖ్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా వచ్చే ఆదివారం ఓ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం షారుఖ్.. తన నివాసమైన ‘మన్నత్’ ఎదుట అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. అభిమానులు చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆయన ఐకానిక్ పోజ్ రీక్రియేట్ చేశారు. అలాగే, ‘పఠాన్’ పాటకు కాలు కదిపారు. ఇదిలా ఉండగా, ఈ మీట్ అండ్ గ్రీట్‌లోనే ‘పఠాన్’ను ప్రసారం చేయనున్న సదరు ఛానల్ సుమారు 300 షారుఖ్ అభిమానులతో ఆయన ఐకానిక్ పోజ్‌ను రీక్రియేట్ చేయించి.. గిన్నిస్ రికార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక, షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’లో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నయనతార కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే